"ఇది విన్నావా? వారి ఆదాయం ఎంతో తెలుసా? "
"తెలీదు. 2-3 వందల కోట్లు ఉంటుందేమో "
"పోయిన సంవత్సరం 2,262 కోట్లు"
"పర్యాటక ప్రదేశం కదా, భక్తులు ప్రసాదాలు, స్పెషల్ దర్శనాలు, తల వెంట్రుకలు, కాటేజిలు అవి ఉంటాయి కదా. ఆ మాత్రం ఆదాయం వస్తుందిలే."
"ఒక్క హుండీ ఆదాయం 1100 కోట్లు. "
"ఈ దేవుడు ఆ దేవుని దగ్గర చేసిన అప్పు తీరాలి కదా. కనీసం ఈ కలియుగాంతంకైనా తీరుతుందో లేదో. "
"ఒక దేవుడు ఇంకో దేవుడి దగ్గర అప్పు తీసుకుంటే... దానికి వీళ్లకు ఏంటి సంబంధం? "
"!!"
"అప్పు ఇచ్చిన దేవుడి బ్యాంకు అకౌంట్ ఏంటి, మంత్లీ EMI ఎంత, ఎన్ని సంవత్సరాలు కట్టారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు కట్టాలి? "
"బోడి గుండు మీద వెంట్రుకలు పీకే పని చేయక, ఆలా మాట్లాడితే కళ్ళు పోతాయి. ఆపద మొక్కులవాడు, అనాధ రక్షకుడు. కోరికలు తీరిన భక్తులు మొక్కు తీర్చుకుంటారు"
"సరే తీరినవాళ్లు వాళ్ళ సంతోషం కొద్దీ ఇచ్చారు అనుకుందాం. మరి తీరని వారికి ఏమైనా లయబిలిటీ ఇస్తారా?"
"అదెలా కుదురుతుంది, ఎవరేం పాపం చేసుకున్నారో? చేసిన కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే కదా? "
"తెలిసి ఏ తప్పులు చేయకపోతే?"
"పూర్వ జన్మలో కొన్ని తెలిసి చేసిన తప్పులు అయ్యుండొచ్చు కదా? "
"బాగుంది, అంటే పెట్టుబడి (capital) లేదు, ఉత్పత్తి (production) లేదు, distribution లేదు, కానీ ఆదాయం (revenue) మాత్రం ఉంది. మంచి జరిగితే credit, లేకపోతె నీ (ఖ)కర్మ."
"అంటే అందరు పుణ్యం పాపం చేసినప్పుడే కాదు, కొంత మందికి కులదైవం. ఇంట్లో ఆచారంగా ఇస్తుంటారు. ప్రతి సంవత్సరం కొండకు వెళ్లి అందరిని చల్లగా చూడు స్వామీ అని ఏమీ ఆశించకుండా హుండీలో డబ్బులు వేస్తుంటారు"
"వీళ్ళు ఇంకా ఘోరం, కట్టు బానిసలన్నమాట!"
"ఎవరి నమ్మకాలు, ఆచారాలు వారివి! అయినా ఇచ్చేవాళ్లకు లేని బాధ నీకెందుకు? "
""

1 comment:
Achcha telugu tarkham...!!
Post a Comment