సాయిమాధవ్ బుర్రా గారు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు. ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి.
ఇంగ్లీష్ పదాలు పడకుండా ఏం రాసారండీ అసలు. మీరు తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం
:)
ఇంగ్లీష్ పదాలు పడకుండా ఏం రాసారండీ అసలు. మీరు తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం
గౌతమీ పుత్ర శాతకర్ణి నుంచి..
- ఇది మా కత్తి వాలంతో రక్తసిక్తమైన పుంతల దేశ రణభూమి నుంచి పంపుతున్న లేఖ. నీకు మా స్నేహపూర్వక హెచ్చరిక. ఇప్పుడు పుంతల మా స్వంతమైంది. పద్దెనిమిది మాసాలుగా మా కత్తికి అంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది. విశ్రాంతి లేదు, విరామం లేదు, దండయాత్రికుడినై ప్రయాణిస్తూనే ఉన్నాను. నేటికి కల్యాణి దుర్గం మీ సౌరాష్ట్ర రాజ్యాలు తప్ప తక్కిన దక్షిణ రాజ్యాలన్నీ మాకు దక్కాయని సగర్వంగా చాటుతున్నాను. మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని మన్నించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాను... సమయము లేదు మిత్రమా శరణమా రణమా. ఇది భావి భారత చక్రవర్తి గా ఈ దక్షిణ ప్రజాపతి ఆజ్ఞ - ఇట్లు శాతవాహన సార్వభౌమ శాతకర్ణి.
- అలలే అల్లరి చేస్తాయి, సాగరం నిశ్శబ్దంగా ఉంటుంది; ఒక్కసారి ఉప్పొంగితే ఒక్కడు కూడా మిగలడు. సాగరం పొంగింది ప్రభూ, మీ దాకా రాకుండా జాగ్రత్త పడండి.
- మొసలి నోట పడ్డ మదగజం అవుతాడని మహా విష్ణువుతోటే చెప్పమంటున్నారే? శాతకర్ణి సార్వభౌముడు నారసింహుని నరావతారం. కాస్త ఆలోచించండి ప్రభూ.
- కుందేళ్ళకి కొమ్ములుంటాయి, మెత్తాళ్ళకి మొలతాదులుంటాయి, మగువల ముంజేతికి మీసాలుంటాయి, కారణం అది శాతకర్ణి ప్రాంగణం.
- సంబాషణ
"నిన్నిప్పుడు బంధిస్తే"?"వారొస్తారు... కారాగారంలో వేచి ఉంటాను!!""మరి వధిస్తే?""మీరొస్తారు, కాటి వాకిట నేను కాచుకొని ఉంటాను" - తలవంచకు, అది నేను గెలిచిన తల, నాది. నువ్వు రాజ్యాన్ని ఇవ్వనన్నా రాణాన్ని కోరుకున్నా తప్పు కాదు - అది పౌరుషం. ఈ గడ్డను నువ్వేలినా నేనేలినా తప్పులేదు, ఒకే ఖండ వారసత్వం. పరాయి యవ్వనుల పంచన జేరావు, తప్పా కాదా?
- మగువల ముంజేతికి గాజులు అందం, మగాడికి గాయాలందం!
- మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చటం. ఆహా! ఆడవాళ్లది ఎంతటి సంస్కారం. ఆడవాళ్ళ సంస్కారాలు మీకు పడక గదిలోనే గుర్తోస్తాయే.
- మీలో ఉన్నంత వరకే అది మీ రక్తం. అది నాలో పురుడు పోసుకున్నాక అది నాది. పసిపిల్లాడిని యుద్ధానికి తీసుకెళ్తా అంటున్నారే, మీరు తండ్రేనా? తొమ్మిది నెలలు కష్టపడి కడుపు చించుకొని కంటే కదా తెలిసేది. ఇది నా బిడ్డ నేను పంపను.
- నా భర్తనే కాదంటూంటే మధ్యలో ఈ మహారాజు ఎవరు?
- నవమాసాలు మోసి కని నీ బరువు తీర్చుకున్నావు. తండ్రిగా నా ప్రాణం పోయేంతవరకు తన బరువును మోస్తూనే ఉంటాను. పులవమావి కేవలం మాకు కొరివిపెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహన జ్యోతిని నా తరువాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటానా? పోగొట్టుకుంటానా?
- ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారి ఇవ్వాలి.
- నాకు సమానుడయ్యె వాడిని కన్నతల్లి ఇంకా పుట్టలేదు.
- మనం కథలు చెప్పుకోకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి.
- దేఖ్! అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకముందే కోట వదిలిపో. లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణం అంటే రక్షా, రణం అంటే మరణ భిక్షా. శరణమా? రణమా??
- ఈ కథలో నీతి ఏంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి. ధర్మంకోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలూ కప్పలూ పడుతూ కూర్చుంటే చీమలకు కూడా లోకువైపోతాము.
- "దేశం అడుగున బ్రతికే బడుగు జాతికి ఇంత రోషమా?". "బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అథములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునీతలం, వీరులం, వేద భూమి వేరులం."
- దేఖ్! నా కొడుకు తల కాదు కదా, మూడు సముద్రాల నీళ్లు తాగి ముందుకు ఉరుకుతున్న నా గుర్రపు గెట్టలకంటిన మట్టిని కూడా ముట్టలేవు.
- "ఎలా ఆకలి అవుతుంది? నా బిడ్డ యుద్ధంలో ఉన్నాడు". "యుద్ధంలో నా బిడ్డ కూడా ఉన్నాడు."
- నాహాపనా యుద్ధం నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు, రేపటి తరాల కోసం. ఒకే నెల మీద ఇన్ని హద్దులు, ఒకే జాతిలో ఇన్ని పోత్తులు ఉండకూడదు.
- యుద్ధం ముగిసింది. ఇక మనతో తలపడిన ప్రతి సైనికుడు మనవాడే, తల తెగిపడుతున్న ఈ నహాపడునితో సహా.
- హిమాద్రి నుంచి దక్షిణ సముద్ర పర్యంతం, సహ్యాద్రి నుంచి తూర్పు సముద్ర పర్యంతం, అంగ, కళింగ, కదంబ, కలబర, కోసల, కుంతల, కొంకణ, విదర్భ, అవంతి, అనూబా, అవిరా, అపరాధ, ఉకుర , అకర, అసిక, అశ్విక, మృగ, మార్గ, మహిష, మగధ, చేల, చోళ, పాండ్య, సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం.
- యవనుడా వాడి జనకూడా, నీలా ఈ దేశం నా దేశం అని ఏ దేశం నుంచి ఎవడు వచ్చినా అడుగు పెట్టినచోటే ఆరడుగులు దానం ఇస్తా, ఆయువు తీస్తా. రమ్మను, నేను సిద్ధం.
- నువ్వు జన్మనిచ్చింది మారణహోమానికి ..
- నేను ప్రథమపూజ చేస్తా అన్నది మా అమ్మకి కాదు.. 'అమ్మకి'.
- ఓడించా, మారలేదు..క్షమించా, మారలేదు..వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు..
- ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇప్పుడు ఉనికి చాటుదాం.
- నేను బొట్టుపెట్టింది నా భర్తకు కాదు, ఒక చరిత్రకి.
- తరుముదాం - తురుముదాం.
- ప్రసవవేదనలో తల్లి పడే బాధ కన్నా, పిల్లాడి ఏడుపే అందరికి కావాలి.
- మీరు వెలుగుని వెతుకుతున్నారు, నేను చీకటిని ఛేధించి వెలుగు నింపుతున్నా..
- దేశం మీసం తిప్పుదాం.!!