ఈ జీవన తరంగాలలో పాట తరువాత అంతగా నచ్చిన పాట ఇదే అయ్యి ఉంటుంది. రెండూ ఒకటే అర్థం వచ్చాయి... కాలాలు వేరు అయినా...
రచన: సిరాశ్రీ
అవసరం అవసరం అవసరం
అవసరం అవసరం అవసరం
ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం
వరకట్నం ఇచ్చేవరకూ మామ అవసరం
అనురాగం ఆత్మీయతలు మాయమాటలు
అవసరం తీరే వరకే బంధమవసరం
||అవసరం||
కాయలమ్మేరోజు చెట్టుపేరు అవసరం
సేద దీరు వేళా దాని నీడ అవసరం
ఆకురాలు కాలం వచ్చి మోడువారితే
ఎవడికీ దాని బాధ లేదు అవసరం
||అవసరం||
అధికారం ఉన్నన్నినాళ్ళు రాజు అవసరం
అదికాస్తా పోయినప్పుడు లేదు అవసరం
బతికుండగా గుండెనెంతో బాధపెట్టిన
పోయాక దండ వేసి దండమవసరం
||అవసరం||
రచన: సిరాశ్రీ
అవసరం అవసరం అవసరం
అవసరం అవసరం అవసరం
ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం
వరకట్నం ఇచ్చేవరకూ మామ అవసరం
అనురాగం ఆత్మీయతలు మాయమాటలు
అవసరం తీరే వరకే బంధమవసరం
||అవసరం||
కాయలమ్మేరోజు చెట్టుపేరు అవసరం
సేద దీరు వేళా దాని నీడ అవసరం
ఆకురాలు కాలం వచ్చి మోడువారితే
ఎవడికీ దాని బాధ లేదు అవసరం
||అవసరం||
అధికారం ఉన్నన్నినాళ్ళు రాజు అవసరం
అదికాస్తా పోయినప్పుడు లేదు అవసరం
బతికుండగా గుండెనెంతో బాధపెట్టిన
పోయాక దండ వేసి దండమవసరం
||అవసరం||