పెదరాసి పెద్దమ్మ వున్నప్పుడు ఆకాశం చాలా కిందకి ఉండేది, ఎంత కిందకి అంటే తాను వంగి నడవాల్సి వచ్చేది! ఒక రోజు తాను పిడకలు చేసుకొంటోంది,అప్పుడు ఆకాశం ఆవిడ తలను తాకింది, కోపమొచ్చి పిడకతో కొట్టింది, ఆకాశం కొంత పైకి వెళ్ళింది!! కోపం తగ్గక మరో పిడకతో మళ్ళీ కొట్టింది, ఆకాశం ఇంకా పైకి వెళ్ళింది! ఎంత పైకి అంటే ఇప్పుడున్నంత పైకి , ఆ రెండు పిడకలే సూర్య చంద్రులు!!
చంద్రుడి మీద మచ్చ ఏంటి అంటే... ఇంకో అవ్వ కథ.
ఇలాంటి కథలు విని అవి నిజనమనుకొని పెరిగిన నేను... అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఆ అమాయకత్వం గుర్తుకొచ్చి నవ్వు వస్తుంది... అది అమాయకత్వం అని తెలిసే విజ్ఞత ఎలా వచ్చిందని ఆశ్చర్యం వేస్తుంది... ఇవన్నీ "రూఢీ"గా ఒకే lifetime లో అనుభవించిన generation లో పుట్టినందుకు ఒకింత ఆనందం కూడా కలుగుతుంది.
దాన్ని పక్కన పెట్టి... మీ creativity ఉపయోగించి... ఈ కథను కంచికి చేరనీకుండా పొడిగించండి... అంటే నక్షత్రాలు ఎలా వచ్చాయి? పిడకలు ఒకటి తరువాత ఒకటి ఎందుకు కనిపిస్తున్నాయి... అప్పుడప్పుడు మాయం(eclipse) ఎందుకు అవుతున్నాయి... ఇలా అన్నమాట.
నా ప్రయత్నం...
ఆకాశం మొదట్లో రంగులేకుండా, చీర అంత చిన్నదిగా ఉండేది. ఎవరింటి పైన వాళ్ళ ప్రత్యేక ఆకాశం ఉండేది. ఒక పండగ రోజు బట్టల సాయిబు దగ్గర ముచ్చట పడి "చమ్కీలు" ఉన్న నీలం చీర కొనుక్కుంటుంది మన పెద్దమ్మ. మరునాడు దానిని నీళ్లలో నానబెట్టి బాగా ఉతికి చూసే పాటికి చీర రంగు వెలిసిపోయి చమ్కీలు ఊడిపోయి ఉట్టి తెల్ల పీలిక మిగిలిపోతుంది.
ఇలా అయ్యింది అని చెబితే సాయిబు నమ్మడని ఆ నీళ్లు కిందపోయకుండా ఆకాశంలో ఉంచింది. సాయిబు ఎప్పటికీ రాలేదు... కథ ఇక్కడ దాకా వచ్చిందండీ.... ఇక్కడ నుంచి దేవేంద్రుడినో బ్రహ్మానో పిలిచి ఆ ఆకాశాన్ని కొద్దిగా spread చేసి పెద్దమ్మకు help చేద్దురు please. ఇంకా మా పిల్లలకి మంచి science class లాగా కూడా పనికొస్తుంది.