Monday, February 05, 2024

My Thoughts on Myth of Normal

First 20-odd chapters the author narrated many problems of modern society. The list is long - Stress, childhood trauma, side effects of silently suffocating, self-criticalness, social expectations that shape our lives, guilt, self-loath, autoimmune diseases and not being authentic with ourselves.  Some are first-world problems and many are across the board. When I was reading them I was connecting with some and feeling helpless (because that is the nature of those problems). 

I agree with the many problems he mentioned. Some problems are part of the “conformity bias”. We want to “fit in” and in that process, we suffer, and do things that we don’t like. And some problems are like “I don’t know what I can do” types - though it makes me feel sad and feel victimized for things that are not in my control.  For example. He says all addictions have roots in childhood suffering. He has a point - but I have a choice now.


The last chapters are on self-compassion, awareness, acceptance, and healing types of solutions. They give comfort and relief for sure. He shared his personal experience in a South American country, some shaman/rituals that helped him “feel good”. They told him that he accumulated some kind of “darkness” while “fixing others as doctors”. I guess that’s where my disconnect started.


Overall, the way I see all the problems he narrated as a good "list of unresolved challenges” in the modern world. I see these are a result of “evolution”. Modern life is stressful, unfortunately. It is what it is. Some of the problems we are facing will not be solved in our lifetime, but I have confidence we will find long-term solutions. In that process, we set “new normal” baselines… and some 500 years down the line, there will be one more book debating myths of that new normal :). 


I was drawing an analogy with three other books while reading Myth of Normal. 

  1. Suggestible You - I read this 6 years back. Chronic diseases cost billions of dollars (670 per year?). And most of the medicine used is a version of placebo (or in-conclusive impact pill). So he recommends that we bring in the practices in countries like China, Taiwan, India, and South Africa. Imagine shamans/rituals done by doctors in white coats and with the whole hospital setup. After reading this book I stopped thinking of medicine in “binary”. It is not good vs bad -> what percent good? That is where I started putting 10% into placebos. And then there is another factor - affordability. 

  2. Rachael Hills - One is a psychologist who wrote about the social issues around marriage/dating in the Americas. This is research she did and the kind of pressure people go through in selecting a partner. I was surprised to hear the kind of pressure people go through when they stay “single” here in developed countries.

  3. Malcolm Gladwell (In “What the Dog Saw…”.) In this book, he argues that modern-age women’s main problem is exposure to hormones. A few centuries ago we didn’t have birth control. During the prime age of 15-20 years, every 1 1/2 to 2 years women were either carrying or feeding. With birth control and new age, challenges are new that humans are exposed to in the modern age.

I know it is a bit long, but that concludes my thoughts on this book :).


Saturday, October 14, 2023

Personal Truth


లోతైన విషయాలు అర్థం చేసుకోటానికి లోతైన అవగాహన కావాలి, చర్చ మరింత గంభీరంగా చేయాలి - JP 

Personal Truth అంటే నాకు మాత్రమే నిజం అనిపించేది, లేకపోతె కొంత మందికి - వర్గం, దేశం మతం (అది వేల మంది కావొచ్చు, లక్షలు, కోట్లు కూడా కావచ్చు). నిరూపణకు నిలబడని ఇలాంటి నిజాలను Personal Truth అంటారు అని ఇవ్వాళే తెలుసుకున్నాను. 

నిరూపణకు నిలవని వాటిని కొట్టెయ్యలేం, అలాగని నిజం అని నిర్ధారణ చెయ్యలేం. అప్పటి వరకు "ఇదే నిజం" అని ఢంకా మోగించటం కంటే "ఏమో తెలీదు" అని ఊరుకుండటం ఉత్తమం. 

ఎవరో ఎవరి మీదో అలిగి, ఇంకోరి మీద మనసు పారేసుకుని, ఇంకేదో చేస్తే మనుషులు పుట్టారని ఒకరు. ఆబ్బె కాదు పదిహేను వేల సంవత్సరాల క్రితం మా దేవుడు వచ్చి "ఎలా జీవించాలి" అనే విషయాన్ని నేర్పించారు అంటారు... మరొకరేమో లేదు "ఎలా ఆలోచించాలో" ("conscious mind") అనే evolution ని "introduce" చేసింది మాత్రం మాదేవుడే అంటారు. ఇలా చాలా కథలు ఉంటాయి. 

వాస్తవాలు ఒక వర్గం వారికి మాత్రమే పని చెయ్యవు. అందరికి పని చేస్తాయి. మీ నమ్మకాన్ని బట్టి అవి ఉండవు. ఉదాహరణకు pi అంటే 3.14. అంతే గాని మా దేశంలో మేము 2.14 అని మేము నమ్ముతున్నాం అంటే కుదరదు. 

కథలు బాగుంటాయి. ఏమి తెలీనప్పుడు ఊరట కలిగిస్తాయి... ఒక్కోసారి నిజమేమో అని బ్రమ కలిగిస్తాయి. అంతే కానీ కథలు ఎప్పటికి నిజాలు కావు. 

1833 లో 33 సంవత్సరాలకు ఒకసారి కనిపించే తోక చుక్క ఒకటి భూమికి దగ్గరగా వచ్చింది. తోక చుక్క దగ్గర్లో ఉన్నప్పడు meteor storm వస్తుంది (అది ఉన్న కక్ష్య, భూమి కక్ష్యకు ఎంత దూరంలో ఉందో అనే దాన్ని బట్టి). ఒక పెద్దాయన ఈ వింతను తన పుస్తకంలో రాసిన ఒక వాక్యంతో అన్వయించుకొని యుగాంతం అవుతుంది అని అందరి తలుపు తట్టి చెబుతున్నాడు. 

అప్పటికి తోక చుక్కల గురించి అంతగా తెలీదు. శాస్త్ర పరిజ్ఞానం అంతగా పెరగలేదు. అయితే ఈయన అబ్రహం లింకన్ ఇంటి తలుపు కూడా తట్టి చెప్పాడు. లింకన్ గారు బయటకు వచ్చి చూసి, మిగతా constellation అంతా అలాగే ఉండటం గమయించాడు. కాబట్టి నిజం అవ్వటానికి ఆస్కారం లేదని హాయిగా నిద్రపోయారు. 

శృతిశ్చ బిన్నాహ్ స్మృతయేశ్చ బిన్నాహ్ …. మహా ఋషీణాం మాతయశ్చ బిన్నాహ్… మలయశ్రీ - చరిత్ర పరిశోధకులు - for a BBC interview.

అనేక రకాలుగా ప్రపంచం విస్తృతంగా ఉంది. విశ్వవ్యాప్తంగా ఎన్నో రకాల భావాలు ఉన్నాయి. అందులో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. మనం వారి (టి) వారసులం. కాబట్టి అందులో చెడును విసర్జించాలి, అబద్ధాల్ని వదులుకోవాలి, మంచిని స్వీకరించి, నిజాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలి. 

పుస్తకాల్లో రాసినవి అయినా, మీకు ఇష్టమైన వారు చెప్పినా... ప్రతిది ప్రశ్నించతగినదే. 

Sunday, May 23, 2021

ఏరు మీద అలిగి..!

అదేదో సినిమాలో ఒక ప్రముఖ హీరోది ఒక కామెడీ డైలాగు ఉంది... హీరోయిన్ ఎదో మాయ రోగం వచ్చింది అని, తను ఎదో ఆకు పసర వైద్యం ఎదో తీసుకుంటుందని... "గోరింటాకు, పిప్పింటి ఆకు, బలుసాకు, బచ్చలాకు, ఉలింద్రాకు, ఉమ్మెత్తాకు, జమ్మాకు, జామాకు, తంగెడాకు, తమలపాకు... ఇలా అన్ని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున రెండు నెలలు వాడితే తగ్గిపోతుంది అని చెప్పారన్నా". 

నేను ఏ విషయం గురించి చెప్తున్నానో మీకు అర్థం అయ్యే ఉంటుంది ఈపాటికి. "సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు వాడితే తప్పేంటి?" అనొచ్చు మీరు. ఉచితము, హానికరం కానంత మాత్రాన అది ఔషధం అవ్వదు. ఉబ్బసం వఛ్చిన వాళ్లకి ఇదివరకు చేప మందు అని ఇచ్ఛే వాళ్ళు. ఇది మందు ఎలా అవుతుంది అని కోర్టుకు వెళ్తే దాన్ని చేప "ప్రసాదం" అని ఇవ్వటం మొదలు పెట్టారు. జనాలని educate చేసే పని మాత్రం చెయ్యరు.

ఆధునిక వైద్యమే తన ప్రోటోకాల్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ దగ్గర నుంచి, ప్లాస్మా తెరపీ దగ్గర నుంచి, నిన్న మొన్నటి రెమెడీస్వెర్ వరకు ఎప్పటికప్పుడు పని చెయ్యని విధానాల్ని వదులుకుంటుంది. 

ఇక మందు కనిపెట్టాం అని చెబితే ఎక్కడ బొక్కలో వేస్తారని ఎవరికి వారు వైద్యుల అవతారం ఎత్తారు. అల్లం బెల్లం, ఉల్లి వెల్లుల్లి, రక రకాల కాషాయాలు చివరకు జంతువుల మల మూత్రాలు కూడా తింటే తాగితే ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది అని డబ్బారాయుళ్లు మొదలయ్యారు.

విషయం ఏంటి అంటే... నువ్వలుండలు తిను, మజ్జిగ పులుసు తాగు, వేడి వేడి అన్నంలో మెంతి ఆవకాయ తిను, అలాగే ఇడ్లీ తిను, దోరగా roast చేసిన ఉల్లి పెసరట్టు తిను, ఉప్పు కారంలో వేయించిన జీడిపప్పు తిను, పచ్చి ఉల్లిపాయ ketchup వేసుకొని boiled egg తిను, బిర్యాని తిను. ముద్దపప్పు ఆవకాయ తిను, గుత్తి వంకాయ మసాలా తిను, అప్పడాలు నంజుకుంటూ పప్పుచారు తిను. ఆరోగ్యాంగా ఉండటం కోసం సమతుల్య ఆహారం తీసుకోని, సరిపడా వ్యాయామం చేసి, కాసేపు ఎండలో కూర్చొని... కావాల్సిన నీళ్లు తాగి, హాయిగా నిద్రపో... ఆ విషయంలో ఎవరికి పేచీ ఉంటుంది? ఏదైనా మితం ఉత్తమం.

పేచీ అల్లా ఇవి తింటే ఏ రోగం రాదు అని సోది కబుర్లు చెబితేనే! 

నిమ్మకాయ నీళ్ల సార్లు, కొబ్బరి నూనెల సార్లు, చిరు ధాన్యాల సార్లు, చిన్నఉల్లిపాయల సార్లు, అల్లం బెల్లం సార్లు ... ఈ సార్ల పని చాలా సులువు. మార్కెట్లో ఏ కొత్త జబ్బు వచ్చినా నిమ్మకాయ నీళ్ళుతో పాటు ఏదో ఒక వైద్యం చెప్తారు. కరోనా అయినా black fungus అయినా ఒకటే కొట్టుడు, కలిపి కొట్టారా కోవేటి రంగా! 

హృదయ కాలేయం లో మా సంపూర్ణేష్ అన్న ఎప్పుడో కనిపెట్టాడు! తేనే, నిమ్మరసం, యాపాకు ఆయుర్వేదిక వనమూలికలు కలిపి కారు చౌకగా computer చెయ్యొచ్చు. అదే కొద్దిగా కర్పూరం కలిపి కంట్లో పోసుకుంటే సమ్మలోరి కెల్ల, కరోనాతో పకోడీ వండుకోవచ్చు. కారు చీకట్లో కాంతి రేఖ అని, భారతీయ విజ్ఞానం పేరుతో ఇలాంటి placebo లు ఇవ్వటం మాత్రం ఆపరు.

ఆధునిక వైద్యం మీద నమ్మకం లేక, రోజుకో రకం మారుతున్న వైద్యం పట్ల అవగాహన పెంచుకోలేక,  ఖర్చులు తట్టుకోలేక, ప్రభుత్వ అసమర్థతని ప్రశ్నించలేక. ఇలాంటి నాటు వైద్యం, ఇంటి వైద్యం, భూత/ప్రేత వైద్యం వైపు వెళ్తున్న అమాయక ప్రజల్ని చూస్తుంటే నాకు ఒక ముతక సామెత గుర్తుకు వస్తుంది... "ఏరు మీద అలిగి, ముడ్డి కడుక్కోటం మానేసాడు అంట ఒకడు".

Wednesday, February 24, 2021

యవనుడా వాడి జనకుడా!

 "యవన రాజ్య స్థాపనాచార్య" - అని శ్రీకృష్ణ దేవరాయలకి ఒక బిరుదు ఉంది... ఎవరా యవనులు? ఒకటో శతాబ్దానికి చెందిన గౌతమీ పుత్ర శాతకర్ణి అప్పట్లో గ్రీకులని యవనులు అన్నాడు.

మరి పదహారో శతాబ్దపు యవనులు ఎవరు? ముస్లిములు!

విచిత్రం ఏమిటి అంటే మన రాయలవారు డెక్కన్ రాజైన కూలీ ఖుతుబ్షా ను ఓడించి బహమనీ సుల్తానులని తీసుకొచ్చాడు... ఒక యవనుల్ని వదిలించి మరో యవనుల్ని తెచ్చాడు...!

చరిత్ర అంతా convenience కోసం చేసిన pact లు... ఎవరికి అనిపించింది వారు చేసారు... మతం ఇందులో ఒక చిన్న పాత్ర మాత్రమే.

Wednesday, August 12, 2020

డాడీ...! కనక్ అంటే ఏంటి?

 మా అమ్మాయి హిందీ చదువుతుంది ఇవ్వాళ... 

"డాడీ...! కలశ్ అంటే ఏంటి?"

"కలశం - తెలుగు తల్లి బొమ్మలో కొబ్బరికాయ పెట్టి ఉందే అదీ"

...

....

"డాడీ...! గగన్ అంటే ఏంటి?"

"గగనం - అంటే ఆకాశం"

...

....

"డాడీ...! కనక్ అంటే ఏంటి?"

నా హిందీ తెలివి తేటలకి నాకే ముచ్చటేసింది... అదే ఊపులో 

"కనకం - బంగారం ఉంది కదా అదే"

.....

ఇంతలో లోపల్నించి మేడం ఓ అరుపు...

"మీ నాన్నని హిందీ అడిగితె సర్వం సర్వనామమే... కనక్ అంటే శబ్దం Sound"

.....

.....

నాకు sound లేదు.

అదీ విషయం...!


Thursday, June 04, 2020

JP Speech on Humanism

HG Wales అన్నట్లు కార్య కారణ సంబంధాలు తెలీని రోజుల్లో మనిషి తొలినాట నిర్ణయించింది మతం. పిడుగు పడింది... ఎక్కడ నుంచి పడింది? ఎందుకు పడింది? ఎలా పడింది? ప్రమాదం జరుగుతుంది... నష్టం కనిపిస్తుంది... కారణం తెలీదు... ఎవడో ఊహించాడు...అది అర్జునిడి శీల అని.

ఒక రకంగా ఆనాటి శాస్త్రీయ దృక్పధంగా వచ్చిన మతం, ఇప్పుడు పిడివాదంగా మారింది.  సోక్రటీసు చెప్పాడు... "పెద్ద బండరాయి చిన్న రాయికంటే వేగంగా పడుతుంది" అని. గెలీలియో దానిని పరీక్షించి చెప్పే వరకు ఎవరికీ అది నిజం కాదు అని తెలీదు.

వేల సంవత్సరాల క్రితం చార్వాకులు నిర్భయంగా ఈనాటికి అబ్బురపరిచే ప్రశ్నలు సంధించిన ఈ సమాజంలో ఇప్పటి పరిస్థితులు వేరు. దక్షిణాన ఎత్తు ఉండాలి కాబట్టి, ఉత్తరాన పల్లం ఉండాలి కాబట్టి... బోల్డంత ఖర్చు పెట్టుకొని... ఎండాకాలంలో దక్షిణాన పడమటన బాగా వేడి వస్తుంది అని తెలిసినా కూడా... ఈశాన్యంలో గాలి చల్లగా వస్తుంది అని తెలిసినా కూడా... నైఋతిలోనే ఉండాలి అని... ఎన్నో మూర్ఖపు ఆలోచనలు.

నిర్హేతుకమైన నిరాధారమైన  నమ్మకాలతోటే అసలైన ప్రమాదం.  

MNRoy said "Responsibility only when absolutely required". ఎప్పుడైనా అధికారం లక్ష్యం కాదు. ఒకమనిషి మీద ఇంకో మనిషి పెత్తనం సమాజంలో మంచిది కాదు. తప్పని సరి పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నపుడు చేపట్టేదే అధికారం.

Bose vs MN Roy... Bose tied up with Hitler who was attacking individual freedom. Joined hands with Japan saying that enemies enemy is a friend... but he loves all of us... so we may not be saying anything wrong to him...
But MNRoy is not like that... he had universal approach... సార్వజనీన దృక్పధం... He thought Marx views are the ultimate... as he read and understood he realized that it is పిడివాదం... Not like current day politicians... they hate to disagree...
"సత్యాన్ని తెలుసుకోటానికి ఎంతవరకైనా వెళతాను." అన్నారు అయ్యన. 

ఈ ప్రపంచంలో అందరి మంచి జరిగితేనే నాకు మంచి. (not a zero-sum game) An eye for an eye makes the whole world blind.

ద్వేషరహిత విభేద ప్రకటన, సహేతుకమైన చర్చ ... if there is one lesson... it will be this.

Monday, November 11, 2019

గోరేటి వెంకన్న!


పరిమితత్వం... సహజత్వం...
సంశయవాదిని

|||||||||||||||||
కంచరేగి తీపివొలే... లచ్చుమమ్మో...
నీ కంఠమెంతా మధురమో... లచ్చుమమ్మో...

పారేటేటి అలలమీద పండుటెన్నెల రాలినట్లు
ఊరే ఊట సెలిమలోనా తేట నీరు ఓనకినట్లు...
వెండి మెరుపులా నవ్వు నీదో... లచ్చుమమ్మో...
నీదెంత సక్కని రూపమొ ... లచ్చుమమ్మో...

మంచెనెక్కి కేక బెడితే, కంచి మేకలు సుట్టూ జెరును
నీ అల్లరిని ఆ లేగ దూడలు వొళ్ళో కొచ్చి ఒదిగిపోవును
పాలిపోయిన కంది సేనే ... లచ్చుమమ్మో...
నీవు పాట పాడితే పూతవెడుతది... లచ్చుమమ్మో...

కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ల కళ్ళాపి జల్లి
ముచ్చటోలుక ముగ్గులేసే మునివేలు గోరుపైన
ఆ పొద్దే ముద్దా గోరింటయితది ... లచ్చుమమ్మో...
పొడ ఎండ నీ మెడ నారమైతది ... లచ్చుమమ్మో...

నీ కాలి అందేలా సవ్వడికి తాబేళ్లు ఇసుకలా గంతులేస్తవి
జాలి గల నీ సూపులతోడేళ్ళు సాదు జీవులైతవి
దారిలో పల్లేరు ముళ్ళే ... లచ్చుమమ్మో...
నీ కాలు మోపితే మల్లెలైతవి ... లచ్చుమమ్మో...
|||||||||||||||||



|||||||||||||||||
ముప్పై ఇండ్లు నిండనేలేదు
మొఖం మీద ముదుతులున్నవి
నలభై ఏండ్లు దాటలేదు
నొసటి పైన గీతాలున్నవి

అదురుష్ట రేఖాలంటారా
బుద్ది జీవులారా
ఆకలి కొచ్చిన గీతాలంటారా

మన్ను ఊడిన మట్టి మిద్దెల
సన్న సీమల పుట్టాలున్నవి
సున్నమూడిన గోడలకు
బల్లిగుడ్లే తెల్లంగున్నవి
సాలె పురుగులు అల్లిన పరదాలే
ఈ పెదవాళ్లకు దేవుడిచ్చిన దోమతెరలాయే
|||||||||||||||||


|||||||||||||||||
ఓ పుల్లా ఓ పుడుకా
ఎండుగడ్డీ సిన్న కొమ్మా
చిట్టి గూడు
పిట్టా బతుకే ఎంతో హాయి

చిగురుటాకు
వగరు పూతా
లేత పిందా
తీపు పండూ
నోటి కందీ చింతా లేకా
కునుకు తీసే
పక్షి బ్రతుకే సౌక్యమోయి

పూటకుంటే అంటే జాలు
రేపు ఎట్లనే ద్యాస లేదు
దాసుకునేటి గుణము లేదు
లోభితనము ఎరుక లేదు
ఈ తత్వ వేత్తలు తరచి చూసిన
నరులకున్న ఈర్ష్య
అణువంతను పిట్టకు లేదు

పావురాయి
రామసీలుక
తీతువమ్మా
గోరువంక
తెల్ల కొంగ
వెడల గువ్వా
నరులు పెట్టిన పేర్లు తప్ప
తమకు ఊరూ పేరే తెలువదు
ఆ పేరు కోసం ఉనికి కోసం
ఈసమంతా ఆరాటం ఎరుగదు

సీకటైతే ఒదిగిపోయి
వేకువాలె నిదుర లేసి
గాలిలోనా ఈదుకుంటా
గగనమంచులా తేలుకుంటా
కొండాకోనలు దాటుకుంటా
కొమ్మ రెమ్మల వాలుకుంటా

ఎల్ల వింతలూ కాళ్ళ జూసిన
తానల్లుకున్న గూటిలకెళ్లి పున్నమి వెన్నెలనే గాంచునా
తానల్లుకున్న గూటిని గూడ పిల్లలేదిగినంక
వల్లనాని ఎల్లిపోతది

సదువు నేర్పే సాలె లేదు
బోధ జేసే గురువు లేదు
ఒణుకుపుడితే ఉడుకు లేదు
రోగమొస్తే మందు లేదు

అన్ని ఉన్నాయన్న నరుడు
ఆశ లోభం ఎంటాడంగా
ఏమి లేని పిట్టా సెంతకు
చేరి జాతకమడుగుతుండు

|||||||||||||||||




|||||||||||||||||

సంత

కాయగూరల తట్ట
ఆకుకూరల కట్ట
తమలపాకుల బుట్ట
తంబాకు పొడిమట్ట
మిరపకాయల ఘాటు
ఉట్టి చాపల సోటు
అల్లమెల్లిపాయ
_____
సంత ముందరి బాట
సాలె బట్టల మూట
అర్రేగు మాలని
అరిసె బతుకు బాట

సంతా మా ఊరి సంత
వారానికోసారి జోరుగా సాగేటి
సంతా మా ఊరి సంత 

సుట్టు ముప్పై ఊళ్ళ 
పెట్టు జనమందరు 
పుట్టబగిలి సీమలొచ్చినట్లు వస్తారు 

సంతా మా ఊరి సంత 

తాగి పెళ్ళాంతోని తగవు పడతాడోకడు 
తాగమని పెళ్ళాన్ని బ్రతిమిలాడుతాడు ఒకడు 
సీర బేరం కాడ సిన్న గొడవ జరిగి అలిగిన పెళ్ళాన్ని అడుక్కొంటాడొకడు 
సంతలో సంసారమంత బైటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటవుతారు 

సంతా మా ఊరి సంత 

ఎండ తాపం చేత ఎగపోసుకుంటోచ్చ్చి 
గోళీసోడాను చూసి కాళ్ళాగి పోతావి 
పట్టుమాని మూరెడు ఎత్తు కూడా లేని
పోరడు సిత్రంగా గోలి సోడా కొడతాడు 
రూపాయికే మంది దూపార్సు కుంటుంటే 
కిన్లీ బిస్లరీ ఏజెన్సీ వోడు బిత్తరయిపోతాడు 

సంతా మా ఊరి సంత 

బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు 
మధ్యాన్నమే కల్లు దుకానానికి వస్తాయి 
కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని 
వియ్యమందానికి తయ్యారయ్యేరు 
సంత కల్లుతోనే పెళ్లి ఖాయం చేసి 
పేరుబలం అడిగేందుకు నేరుగా పొయ్యేరు 

సంతా మా ఊరి సంత 

అమ్మ నాయనల మీద బెంగ బెట్టుకున్న 
అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల 
సరుకుల నెపముతో సంతకంటది వచ్చి 
పుట్టునూరోళ్ళు వస్తే పట్టుకొని ఏడ్సు 
సెల్లెలు తమ్ముని క్షేమమడిగినాక 
అమ్మను రమ్మను అని రాగాలు పెడుతాది 

సంతా మా ఊరి సంత 

కాశీమజిలీ కథలు దాశరధి శతకాలు 
వేమూరి కీర్తనలు యాగంటి తత్వాలు 
అరవయ్యేళ్ళ కింద అచ్చు వేయించిన 
చిరుతొండ ప్రహ్లాద భక్త రామదాసు 
యక్షగానాలన్నీ యాడ దొరుకునో గాని 
బుగ్గ బాలయ్యకు బువ్వ పెడుతుంటాయి 

సంతా మా ఊరి సంత 

సంతనాడు ఊరి డొంకల్లా పాటల్లా 
జంటలు కొన్నేమో జతకూడుకుంటావి 
హద్దులు అదుపులు అన్ని గాలికి వదిలి 
వలచిన మనసులు ఒక్కటే పొతావి 
దూరమైనా గాని ప్రేమ మిగిలీనోళ్లు 
వారం వారం సంత పేరుతొ కలిసేరు 

సంతా మా ఊరి సంత