లోతైన విషయాలు అర్థం చేసుకోటానికి లోతైన అవగాహన కావాలి, చర్చ మరింత గంభీరంగా చేయాలి - JP
Personal Truth అంటే నాకు మాత్రమే నిజం అనిపించేది, లేకపోతె కొంత మందికి - వర్గం, దేశం మతం (అది వేల మంది కావొచ్చు, లక్షలు, కోట్లు కూడా కావచ్చు). నిరూపణకు నిలబడని ఇలాంటి నిజాలను Personal Truth అంటారు అని ఇవ్వాళే తెలుసుకున్నాను.
నిరూపణకు నిలవని వాటిని కొట్టెయ్యలేం, అలాగని నిజం అని నిర్ధారణ చెయ్యలేం. అప్పటి వరకు "ఇదే నిజం" అని ఢంకా మోగించటం కంటే "ఏమో తెలీదు" అని ఊరుకుండటం ఉత్తమం.
ఎవరో ఎవరి మీదో అలిగి, ఇంకోరి మీద మనసు పారేసుకుని, ఇంకేదో చేస్తే మనుషులు పుట్టారని ఒకరు. ఆబ్బె కాదు పదిహేను వేల సంవత్సరాల క్రితం మా దేవుడు వచ్చి "ఎలా జీవించాలి" అనే విషయాన్ని నేర్పించారు అంటారు... మరొకరేమో లేదు "ఎలా ఆలోచించాలో" ("conscious mind") అనే evolution ని "introduce" చేసింది మాత్రం మాదేవుడే అంటారు. ఇలా చాలా కథలు ఉంటాయి.
వాస్తవాలు ఒక వర్గం వారికి మాత్రమే పని చెయ్యవు. అందరికి పని చేస్తాయి. మీ నమ్మకాన్ని బట్టి అవి ఉండవు. ఉదాహరణకు pi అంటే 3.14. అంతే గాని మా దేశంలో మేము 2.14 అని మేము నమ్ముతున్నాం అంటే కుదరదు.
కథలు బాగుంటాయి. ఏమి తెలీనప్పుడు ఊరట కలిగిస్తాయి... ఒక్కోసారి నిజమేమో అని బ్రమ కలిగిస్తాయి. అంతే కానీ కథలు ఎప్పటికి నిజాలు కావు.
1833 లో 33 సంవత్సరాలకు ఒకసారి కనిపించే తోక చుక్క ఒకటి భూమికి దగ్గరగా వచ్చింది. తోక చుక్క దగ్గర్లో ఉన్నప్పడు meteor storm వస్తుంది (అది ఉన్న కక్ష్య, భూమి కక్ష్యకు ఎంత దూరంలో ఉందో అనే దాన్ని బట్టి). ఒక పెద్దాయన ఈ వింతను తన పుస్తకంలో రాసిన ఒక వాక్యంతో అన్వయించుకొని యుగాంతం అవుతుంది అని అందరి తలుపు తట్టి చెబుతున్నాడు.
అప్పటికి తోక చుక్కల గురించి అంతగా తెలీదు. శాస్త్ర పరిజ్ఞానం అంతగా పెరగలేదు. అయితే ఈయన అబ్రహం లింకన్ ఇంటి తలుపు కూడా తట్టి చెప్పాడు. లింకన్ గారు బయటకు వచ్చి చూసి, మిగతా constellation అంతా అలాగే ఉండటం గమయించాడు. కాబట్టి నిజం అవ్వటానికి ఆస్కారం లేదని హాయిగా నిద్రపోయారు.
శృతిశ్చ బిన్నాహ్ స్మృతయేశ్చ బిన్నాహ్ …. మహా ఋషీణాం మాతయశ్చ బిన్నాహ్… మలయశ్రీ - చరిత్ర పరిశోధకులు - for a BBC interview.
అనేక రకాలుగా ప్రపంచం విస్తృతంగా ఉంది. విశ్వవ్యాప్తంగా ఎన్నో రకాల భావాలు ఉన్నాయి. అందులో తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. మనం వారి (టి) వారసులం. కాబట్టి అందులో చెడును విసర్జించాలి, అబద్ధాల్ని వదులుకోవాలి, మంచిని స్వీకరించి, నిజాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలి.
పుస్తకాల్లో రాసినవి అయినా, మీకు ఇష్టమైన వారు చెప్పినా... ప్రతిది ప్రశ్నించతగినదే.