కరి నువ్వే మకరి నువ్వే
తేరు నువ్వే పోరు నువ్వే
ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే
కృష్ణుడు నువ్వే అర్జునుడు నువ్వే
--- సిరివెన్నెల
కరి = ఏనుగు
మకరి = మొసలి
తేరు = రథం
పోరు = యుద్ధం
ఈ బ్లాగు రాసింది మాత్రం నేను, చదివింది నువ్వు :). సిరివెన్నెల గారు చెప్పింది చదివితే అర్థం అయ్యే విషయం కాదు. సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం.
ఈ మధ్య అమెరికాలో "Goat Yoga" అని వచ్చింది. అంటే ఏమీ లేదు, వీళ్ళు ఆసనాలు వేస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లని వీళ్ళ మీద నించోపెడతారు...ట! ఆసనానికి గొర్రెకి సంబంధం ఏమిటో ఆ గొర్రె మందకే తెలియాలి.
అలాగే జర్మనీలో "Beer Yoga" అని మొదలెట్టారు. మత్తులోకి జోగాక సమాధి స్థితి అనుభవిస్తారన్నమాట.
కాబట్టి మిత్రులారా, ఈ సన్నాసులందరు మీ ఇంటి తలుపులు కొట్టక ముందే, మీరెళ్ళి గురువుగారి కాళ్ళు పట్టుకోండి. మీకోసం కాకపోయినా రేపు మీ పిల్లలకో, లేక పిల్లల పిల్లలకో (అప్పటికి మీరింకా ఉంటే) బుద్దిపుడితే 'అమ్మా... నాయనా... ఇదీ సరైన దారి" అని ఒక సలహా ఇచ్చి మీ పెద్దరికం నిలబెట్టుకుందుకైనా పనికి వస్తుంది.

No comments:
Post a Comment