మా అమ్మాయి హిందీ చదువుతుంది ఇవ్వాళ...
"డాడీ...! కలశ్ అంటే ఏంటి?"
"కలశం - తెలుగు తల్లి బొమ్మలో కొబ్బరికాయ పెట్టి ఉందే అదీ"
...
....
"డాడీ...! గగన్ అంటే ఏంటి?"
"గగనం - అంటే ఆకాశం"
...
....
"డాడీ...! కనక్ అంటే ఏంటి?"
నా హిందీ తెలివి తేటలకి నాకే ముచ్చటేసింది... అదే ఊపులో
"కనకం - బంగారం ఉంది కదా అదే"
.....
ఇంతలో లోపల్నించి మేడం ఓ అరుపు...
"మీ నాన్నని హిందీ అడిగితె సర్వం సర్వనామమే... కనక్ అంటే శబ్దం Sound"
.....
.....
నాకు sound లేదు.
అదీ విషయం...!