కులం, మతం, భాష, ప్రాంతం - ఇలా ప్రజల్ని విడగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, అని JP గారి speech లు విని విని ఆ భావాలు నా నర నరానా బాగా ఇంకి పోయాయి. వాళ్ళు చేస్తున్నారు అని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు; ఇలా ఒక catch 22 situation లో... zero sum game ఆడుతున్నాం అని ఆయన ఎప్పుడూ వాపోతుంటారు.
థాకరే సినిమా ఖచ్చితంగా అలాంటి నాయకుడి కథ. "పుంగీ బాజావో, లుంగీ హటావో" అని ప్రాంతీయ వేర్పాటు వాదం మీద పునాదులు వేసుకొని ఎదిగిన నేత. స్థానికేతరులు తమ ఉద్యోగాలు లాగేసుకున్నారని జనాలని రెచ్చగొట్టి, దాంతో ఒక సైన్యం మొదలుపెట్టి, ఇంకా ఆ తరువాత "మంచి" పేరు మీద తనకు తోచిన న్యాయం చేస్తూ ముందుకు సాగిన నాయకుని జీవయాత్ర.
"identity" ని కాపాడుకోవటం అని సమర్ధించుకోవటం, ఇది మా "ఉనికిని" కాపాడుకోవటం అని సమాధానపడటం. ఇదేమి కొత్త కాదు, ఇలాంటి ఉదాహరణలు మనకు ప్రస్తుత రాజకీయంలో చాలా కనిపిస్తాయి. ఇక ముందు కూడా కనిపిస్తాయి.
పూర్తి నియంతృత్వ పోకడలతో... భాషా, ప్రాంతీయ వేర్పాటువాదం, భూమిపుత్ర నినాదం, మతతత్వం..... వీటిని యదేచ్చగా సమర్ధిస్తూ...వీటిని వాడుకొని లబ్ధి పొందేవాళ్లని, వీరులుగా/నాయకులుగా glorify చేసి చూపించటం నాకు నచ్చలేదు.
ఇలాంటి వారి జీవితంలో పెద్దగా choice లు ఉండవు. ఎందుకో మొదలుపెడతారు, తరువాత జనాలు ప్రోత్సహిస్తారు. వీళ్ళు బయటకు రాలేరు, జనాలు కూడా రానీయరు. అలా ఒక parallel system సృష్టించుకొని ఇక అందులో కాలం గడిపేస్తుంటారు.
ప్రజాస్వామ్యం అంటే పెద్దగా అవగాహన లేని సమాజంలో, పరిణామ క్రమంలో వచ్చే నాయకత్వం ఇలానే ఉంటుంది. వీరికి జాతీయత స్వేచ్ఛ కంటే కొంత నియంతృత్వం వైపే మొగ్గు చూపుతారు. వీటికి స్థానికంగా ఉన్న సామాజిక ఆర్ధిక పరిస్థితిలు కూడా కలిసి వచ్చి అది రక్త చరిత్రో, వంగవీటో, కిల్లింగ్ వీరప్పనో, పూలన్ దేవో అవుతారు.
మొత్తం మీద థాకరే సినిమా బాగా తీశారు... intensity ఎక్కడా తగ్గలేదు. ఒక్క చోట కూడా bore కొట్టలేదు. సినిమా చూసిన తరువాత నాకు థాకరే వ్యక్తిగా నచ్చలేదు. నేను ఈ కోణంలో ఎప్పుడూ తనని పరిశీలించలేదు. నవాజుద్దీన్ సిద్దిఖీ చాలా బాగా నటించారు.
థాకరే సినిమా ఖచ్చితంగా అలాంటి నాయకుడి కథ. "పుంగీ బాజావో, లుంగీ హటావో" అని ప్రాంతీయ వేర్పాటు వాదం మీద పునాదులు వేసుకొని ఎదిగిన నేత. స్థానికేతరులు తమ ఉద్యోగాలు లాగేసుకున్నారని జనాలని రెచ్చగొట్టి, దాంతో ఒక సైన్యం మొదలుపెట్టి, ఇంకా ఆ తరువాత "మంచి" పేరు మీద తనకు తోచిన న్యాయం చేస్తూ ముందుకు సాగిన నాయకుని జీవయాత్ర.
"identity" ని కాపాడుకోవటం అని సమర్ధించుకోవటం, ఇది మా "ఉనికిని" కాపాడుకోవటం అని సమాధానపడటం. ఇదేమి కొత్త కాదు, ఇలాంటి ఉదాహరణలు మనకు ప్రస్తుత రాజకీయంలో చాలా కనిపిస్తాయి. ఇక ముందు కూడా కనిపిస్తాయి.
పూర్తి నియంతృత్వ పోకడలతో... భాషా, ప్రాంతీయ వేర్పాటువాదం, భూమిపుత్ర నినాదం, మతతత్వం..... వీటిని యదేచ్చగా సమర్ధిస్తూ...వీటిని వాడుకొని లబ్ధి పొందేవాళ్లని, వీరులుగా/నాయకులుగా glorify చేసి చూపించటం నాకు నచ్చలేదు.
ఇలాంటి వారి జీవితంలో పెద్దగా choice లు ఉండవు. ఎందుకో మొదలుపెడతారు, తరువాత జనాలు ప్రోత్సహిస్తారు. వీళ్ళు బయటకు రాలేరు, జనాలు కూడా రానీయరు. అలా ఒక parallel system సృష్టించుకొని ఇక అందులో కాలం గడిపేస్తుంటారు.
ప్రజాస్వామ్యం అంటే పెద్దగా అవగాహన లేని సమాజంలో, పరిణామ క్రమంలో వచ్చే నాయకత్వం ఇలానే ఉంటుంది. వీరికి జాతీయత స్వేచ్ఛ కంటే కొంత నియంతృత్వం వైపే మొగ్గు చూపుతారు. వీటికి స్థానికంగా ఉన్న సామాజిక ఆర్ధిక పరిస్థితిలు కూడా కలిసి వచ్చి అది రక్త చరిత్రో, వంగవీటో, కిల్లింగ్ వీరప్పనో, పూలన్ దేవో అవుతారు.
No comments:
Post a Comment