Tuesday, March 05, 2019

కొంతమంది కుర్రవాళ్ళు!

సమాజంలో జరుగుతున్న చికాకు పుట్టించే కొన్ని సంఘటనలు చూసినప్పుడు భాష తెలీక తికమక పడుతుంటే ఎప్పుడో దశాబ్దాలనాటి శ్రీ శ్రీ గారు రచించిన ఈ పాట వినపడింది.

మూఢ నమ్మకాలలో చదువుకున్న మూర్ఖులు, fake news నిజం అనుకునే సన్నాసులు ఇదంతా మానవజాతికి కొత్తగా సంతరించిన జబ్బేమీ కాదు, కానీ IT విప్లవం తరువాత బాగా ముదిరిన జబ్బు. అప్పటి సమాజంలో ఆయన వీళ్ళని పకీర్లు, పుకార్లు అన్నారు. ఇప్పుడు వీరు రూపాంతరం చెంది దొంగ స్వాములు... fake news source లు అయ్యారు.

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు
పేర్లకీ పకీర్లకి పుకార్లకీ నిబద్దులు 

నడిమితరగతికి చెందిన అవగుణాల కుప్పలు 
మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు

తాతగారి బామ్మగారి భావాలకి దాసులు 
నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు

నిన్నటి లీడరు ధోకా నేడు చూడ జాలరు
కన్నులున్న జాత్యంధులు కాకినైనా తోలరు

కళలన్నా కవితన్నా వీళ్ళకి చుక్కెదురు 
గోలచేసి అరవటమే అయ్యో వీళ్ళేరుగుదురు 

కొంతమంది యువకులు ముందు యుగం దూతలు 
భావన నవజీవన బృందావన నిర్మాతలు

బానిస బంధాలను తలవంచి అనుకరించరు 
పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు

వారికి మా ఆహ్వానం!

ఇందులో ప్రతీ అక్షరం నిజమే! చివరగా ఆనాటి సమాజంలో ఆశ ఎలా ఉందొ, నేటి సమాజంలో కూడా కొంత ఆశ ఉంది. ఆశే మన పురోగతికి పునాది.

నేను ముసలి వాడిని కాదు అసలివాడిని
పీడితులని వెంటేసుకు మసలువాడిని
అందుకున్న ఆకాశపు కొసలువాడిని
పడగెత్తిన తాచుపాము బుసలవాడిని

శ్రీ శ్రీ గారు మీకు నా వందనం!

No comments: