Thursday, February 14, 2019

RGV's Rowdy - Tanikella Bharani Dialogues

RGV సినిమా "రౌడీ" సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర డైలాగులు కొన్ని...
  • తమ్ముడూ... సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది... కానీ వీధిలో మొరగటానికీ అడవిలో గర్జించటానికీ ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. 
  • తెలివైన వాడిని తెలివితో కొట్టాలి, మూర్ఖుడిని మహాతెలివితో కొట్టాలి.
  • దారి తెలియని వాడికి దారి చెప్పటం హెల్ప్ అవుతుంది. దారి తప్పినవాడికి ఇంకా తప్పుదారి పట్టించటం మనకి హెల్ప్ అవుతుంది. ఇదే నా హెల్పింగ్ వేదం. 
  • దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకెయ్యాలి, మునగానన్నా మునుగుతాం, ఈతయినా వస్తుంది. అంతేగానీ తుపానొస్తుందేమో, సొరచాపలు ఉంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తామ్. 
  • ఆవేశ పడేవాడు ఆయాస పడతాడు ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా overconfident కాదు కాన్ఫిడెంట్ వేదం. 
  • పితృదేవోభవ అన్నమాట ఒట్టి 'మాట'. మీ నాన్నగారికి కోరిక కలిగితే ఆ కోరిక మీ అమ్మగారు తీరిస్తే accidental గా నువ్వు పుట్టావే తప్ప, నిన్నే కనాలని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోలేదు. అంచేత ఆయనగురించి బాడ్ గా అనుకోటానికి నువ్వేమి ఫీల్ అవ్వఖ్ఖర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే నువ్వు మీ నాన్నగారికి అనవసరమైన పెంట - I mean unwanted item.
  • మనిషన్నవాడు పశువుగా ఉన్నప్పుడే బాగుండేది ఏది పడితే అది తిండం, దేంతోనైనా పడుకోవటం, దిక్కుమాలిన కట్టుబాట్లవల్లే ఈ దరిద్రం అంతా. ఇది ఏ వేదంలోనూ లేదు, ఇది నా వేదం.
  • మీ నాన్నగారికి ఇప్పుడు జనోద్ధరణ అనే దయ్యం పట్టుకుంది అందుకనే అతను ఇప్పుడు పితృదేవోభవా కాదు, పితృ దయ్యమొభవా. నువ్వెలాగైనా ఆ దయ్యాన్ని వదిలించగలిగితే నువ్వు సుఖీ భావా, మేం ఖుషీభవా. 
  • ఉన్నచోట తప్పు చేయకూడదు, తప్పుచేసిన చోట ఉండకూడదు. ఇది నా పర్సనల్ వేదం. అందుకని మనం కొన్నాళ్ల పాటు అన్నగారి డైమండ్ సన్, I mean పుత్రరత్నం భూషణ్ కి దూరంగా ఉండటం మంచిది. 
  • బుల్లెట్లతోటో బాంబులతోటో నీట్ గా కాకుండా కత్తులతో నరికి నరికి చంపితే జనంలో మన పాపులారిటీ రేంజ్ పెరుగుతుంది... ఇదే నా పబ్లిసిటీ వేదం. 
  • పోయినోళ్ళు తిరిగిరారు ఉన్నవాళ్లు పోకపోరు అన్నాడు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ సీక్రెట్టుగా, నువ్వేం బాధపడకు అన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ బహిరంగంగా. 
  • జీవితంలో ఏ రిస్కూ చేయకపోవటమే అన్నిటికన్నా పెద్ద రిస్కు అన్నది నా వేదం. 
  • ఫ్యామిలీ పోతేనేం ఫ్యూచర్ తన్నుకుంటూ వస్తుంది, మనకి కొండంత లాభం వస్తున్నప్పుడు గోరంత నష్టం వచ్చినా పరవాలేదనేది నా కమర్షియల్ వేదం. 
  • కొట్టించుకోవటం అన్నది గతం, తిరిగి దెబ్బ కొట్టడం అనేది భవిష్యత్తు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతం గురించే బాధపడేవాడు వెర్రి పండు, ఈడియాటిక్ ఫ్రూట్ అనేది నా ట్రెడిషనల్ వేదం. 
  • చూడు భూషణ్, ఆయన ఉండగా నువ్వు ఎలాగా అన్నవి కాలేవు... ఆయన పోయిన తరువాతకూడా కాకూడదనే అందరిముందూ నిన్ను చెత్త నాకొడుకుని I mean, వేస్టు ఫెలో ని చేస్తున్నాడనేది నా వేదం. 
  • మౌనం అర్థ అంగీకారం అన్నారు పెద్దలు, ఆలోచన పూర్ణాంగీకారం అంటారు నాలాంటి ప్రభుద్దులు. పితృ దేవునికి పిండం పెట్టడం కన్నా అదృష్టం ఏముంది... ఇదే నా చిట్టచివరి వేదాంతం. 
  • కిష్ణా అన్నగారికీ మీ కుటుంబానికి అయిన లాభాలకి ఎలా కారణం కాదో నష్టాలకి కూడా అలాగే కారణం కాదని నా లాజిక్కయిన వేదం. 
  • మార్లిన్ బ్రాండో "పగే జీవితం కాదని" ప్రపంచ వేదం చెప్పాడు. 
  • నువ్వు సుత్తితో కొట్టినా కత్తితో పొడిచినా నా ప్రాణం పోవాలి అనుకున్నప్పుడు పోతుంది తప్ప తప్ప నువ్వేమీ చేయలేవన్నది నా క్రిమినల్ వేదం. 
ఇన్ని వేదాలు తెలిసినా మంచి మీద చెడు గెలుస్తుంది అని తెలియకపోవటం అనేది నీ బుద్దితక్కువ వేదం. 

No comments: