సంస్కరించుకుందాం అంటే హిందూ మత ద్రోహులు అవుతారా?
ఆచారాలు, సాంప్రదాయాలపై దాడి అంటూ పొతే మన సమాజంలో చట్టబద్ధ పాలన ఉండదు. అనేక ఆచారాలు, విశ్వాసాలకి మూలం అనేక చారిత్రిక సందర్భాలలో ఉంటాయి. కాలానుగుణంగా వాటికి కాలం చెల్లినప్పుడు వాటిని మార్చుకుంటూ ఉంటాం.
సతీ సహగమనం మా ఆచారం, భర్త చనిపోయినప్పుడు మేము ఎందుకు బ్రతికి ఉండాలి? మా చావు మేము చస్తున్నాం, మీకేంటి ఇబ్బంది...? అంటే కుదురుతుందా? ఇంకెవరో వచ్చి బాల్యవివాహాలు మా సంప్రదాయం అని వాదిస్తారు. మరొకరు వచ్చి మా భర్తలు మాకు తలాక్ ఇస్తారు మీకేంటి ఇబ్బంది అంటే ఊరుకుంటామా?
రామాయణ కాలంలో శూద్రుడైన శంబుకుడు తపస్సు చేసుకోటానికి వీలు లేదని రాముడు అన్నాడు... రాముడి దృష్టిలో అందరు సమానమే... ఆయన అన్నాడు అంటే ఎదో ఉండే ఉంటుంది అని ఇప్పుడు శూద్రులు చదవకూడదు అని rule పెడదామా? దశరదుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు, ద్రౌపతికి అయిదుగురు భర్తలు ఉన్నారు... ఆనాటి సమాజంలో అది చెల్లింది.
మన అమ్మ అమ్మమ్మల time లో చూసిన కొన్ని ఆచారాలు ఉన్నాయి... పొద్దున్నే లేచి భర్త కాళ్లకు దండం పెట్టుకోవాలి... భర్త తినకుండా భార్య తిన కూడదు... అవి కూడా తీసుకొద్దాం... పురుషుడు తిని వదిలేసిన plate లో మహిళ తినాలి... భర్త పరమేశ్వరుడితో సమానం అన్నారు కాబట్టి ఆ దిక్కుమాలిన అచారాలన్నీ తీసుకొద్దామా?
అస్పృశ్యత కారణంగా కొందరిని దేవాలయాల్లో అనుమతించలేదు అనేక వందల సంవత్సరాలు... మరి ఆ ఆచారాన్ని కూడా తెచ్చుకుందామా? ఆత్మగౌరవం ఇవ్వని కారణంగా అనేక మంది మతం మార్చుకున్నారు. గరుడ పురాణంలో ఒక చోట బ్రాహ్మణ స్త్రీ రుతుక్రమ సమయంలో మొదటి రోజు "ఛండాల" స్త్రీతో సమానం అని, మూడవరోజు చాకలి స్త్రీతో సమానం అని ఉంది. ఇంతటి కుల దురహంకారాన్ని సంస్కరించకోక పొతే చివరకు హిందూ మతంలో అగ్రకులాల పురుషుల తప్ప ఎవరూ మిగలరు.
పోనీ ఇది మతాన్ని ఏమన్నా ఉద్ధరిస్తుందా అంటే అదీ కూడా లేదు. హిందూ మతంలో ఏ పురాణంలో ఏ వేదాల్లో మహిళలు దేవాలయ ప్రవేశానికి అనర్హులు అని ఉంది చెప్పండి? జగద్గురు శంకరాచార్యులు గారిని arrest చేసినప్పుడు, చట్టానికి వదిలేశారు గాని ఎవరు రాస్తారోకోలు చేయలేదు. స్వామీ వివేకానందుడు "నేను గుడిలో పూజలు చేస్తాను, మసీదులో ప్రార్థనలు చేస్తాను, చర్చిలో మోకరిల్లుతాను భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా హృదయపు తలుపులు తెరిచే ఉంచుతాను" అన్నారు.
It is a religion without circumference - Dr. Sarvepalli Radhakrishnan.
Hinduism is a way of life - SC
ఇంతటి విశాలమైన భావాలు ఉన్న మతాన్ని మీరు ఉన్మాదంగా మారిస్తే, అది ఎవరికి నష్టం? చాందస వాదంలో కూరుకుపోతే ఏమౌతుందో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
శబరిమల ప్రధాన అధికారి "ఈ నిరసనలు ఇలాగే కొనసాగి SC వినకపోతే హింస చెలరేగుతుంది" అన్నారు. ఇంకో మాజీ అధ్యక్షులు "శబరిమలైకి వచ్చే మహిళలని పులులు పురుషులు వెంబడిస్తారు" అని అన్నారు. ఇంకో పెద్దాయన "మహిళలు వస్తే వారి దేహాలను రెండు ముక్కలుగా చీల్చి, ఒక ముక్కను SC కి మరో ముక్కను కేరళ ముఖ్యమంత్రికి పంపిస్తాం అన్నారు. శివసేన వారు అయితే ఆత్మాహుతు దళాలు వస్తాయి అంటున్నారు.
ఇదేనా హిందూ మతం చెప్పింది? ఇదేనా స్వామియే శరణం అయ్యప్ప అనే భక్తులు పలకాల్సిన పలుకులు?
Professor Nageshwar's analysis in his Youtube chanel. https://www.youtube.com/watch?v=KmXKNhz6gjs
No comments:
Post a Comment